బాబు బ్యాడ్ టైం: తప్పు 1… శిక్ష 23!

-

సరైన సమయంలో సరైన నిర్ణయం.. ఈ మాట గతంలో తెలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు వాడిన పదం. సమైక్యాంధ్ర ఉధ్యమం అనంతరం ఏపీ జనం కూడా అదే నిర్ణయం ప్రకటించారు. ఫలితం.. ప్రస్తుతం ఏపీలో ఆ పార్టీ కనుమరుగైపోయింది! మరీ గతానికి వెళ్లకుండా… 2014 నుంచే తీసుకుంటే.. బాబు చేసిన ఒకపని కూడా ఇప్పుడు జీవితాంతం వెంటాడేలా ఉంది! అదే… 23 తప్పు!

chandrababuఅవును… 2014 ఎన్నికల్లో సీనియార్టీని గౌరవిస్తూ, ఆ సీనియారిటీని పూర్తిగా నమ్మిన ఏపీ వాసులు చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు. తన అనుభవంతో విభజిత ఏపీని ముందుకునడిపించమని తెలిపారు. కానీ… బాబు మాత్రం తనను తాను ఏదో ఊహించుకున్నారు. పాలనపై కంటే పబ్లిసిటీపై మక్కువ ఎక్కువ చూపించారు. అది అక్కడితో ఆగలేదు… చెయ్యకూడని ఒక పెద్ద తప్పు చేశారు.

ప్రజా రాజ్యాంగానికి వ్యతిరేకంగా.. ప్రజా తీర్పును అవహేళన చేస్తూ.. ఫ్యాన్ గుర్తుపై గెలిచిన 23మంది వైకాపా ఎమ్మెల్యేలకు పసుపు కండువాలు కప్పారు.. నిస్సుగ్గుగా పార్టీలోకి ఆహ్వానించారు.. వారిలో కొందరికి మంత్రిపదవులు కట్టబెట్టారు. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బాబు ప్రవర్తనపై జనాలకు చికాకు పుట్టింది.

ఫలితంగా… 2019 లో జరిగిన ఎన్నికల్లో ఆ నెంబర్ 23 ని గుర్తుచేశారు ఏపీ ప్రజలు. అవును… 2019లో జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడగా.. అందులో టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితం అ‍య్యింది. అక్కడికే చావుతప్పి కన్నులొట్టపోయిన బాబుకు… మరోసారి పరిషత్ ఎన్నికల రూపంలో 23 దర్శనమిచ్చింది. అవును… 23 ఏళ్ల వయసున్న అశ్విని చేతిలో కుప్పంలో టీ సద్దుమూరు స్థానం వైసీపీకి దక్కింది. టీడీపీకి ఘోర పరాభవం జరిగింది!

దీంతో… నాడు అధికార అహకారంతో చంద్రబాబు చేసిన ప్రజావహేళన చర్య వల్ల… ఇప్పుడు ప్రతీ ఎన్నికలోనూ, అడుగడుగునా బాబుకు ఆ హేళన జరుగుతూనే ఉంది.. ప్రజాగ్రహం ఎదురవుతూనే ఉంది! దీంతో… అధికారంలో ఉన్న నేతలకు బాబు అనుభవాలు ఒక గుణపాఠం కావాలని కోరుకుంటున్నారు విశ్లేషకులు!

Read more RELATED
Recommended to you

Latest news