వీధి రౌడీల్లా అశోక్ గజపతిపై దాడి చేశారు : చంద్రబాబు ఫైర్

వీధి రౌడీల్లా అశోక్ గజపతిరాజుపై మంత్రులు దాడికి తెగించారని చంద్ర‌బాబు ఫైర్ అయ్యారు. మంత్రులు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని.. రామతీర్థం రాముని సాక్షిగా వైసీపీ అరాచకం బట్టబయలైందని ఆగ్ర‌హించారు. దేవాలయాల్లో పాటించాల్సిన ఆనవాయితీని ప్రశ్నిస్తే దాడులు చేసే సంస్కృతికి వైసీపీ ప్రభుత్వం దిగజారిందని… రామతీర్థం ఆలయ కమిటీ ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి రాజు పేరు లేకుండా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు ? అని నిల‌దీశారు.

వేల ఎకరాలను దానం చేసిన కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇదేనా.? అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
కనీసం ప్రోటోకాల్ నిర్వహించాలన్న బుద్ధి ఈ ప్రభుత్వ పెద్దలకు లేదా.? వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అశోక్ గజపతిరాజుపై కక్షగట్టారని మండిప‌డ్డారు. మాన్సాన్ ట్రస్టు చైర్మనుగా తొలగించి భూములు దోచుకోవాలని చూశారని… రామతీర్థం దేవాలయ నిర్మాణానికి అశోక్ గజపతిరాజు విరాళమిస్తే ఎందుకు తీసుకోలేదు..? ఆగ్ర‌హించారు. భక్తితో ఇచ్చిన వాటిని నిరాకరించే హక్కు మీకు ఎవరిచ్చారు.? రామతీర్థంలో రాముడి తల తొలగించి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదని వెల్ల‌డించారు. బూతుల మంత్రితో పోటీపడి కొబ్బరి చిప్పల మంత్రి చిన్నాపెద్ద లేకుండా నోరు పారేసుకుంటున్నారని మండిప‌డ్డారు.