ఇప్పటిదాకా కేసీఆర్ ఏం అనుకున్నా అవన్నీ అయ్యాయి.తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆయన ఆ రోజు అడుగులు వేశారు.ఇరవై ఏళ్ల పాటు దిగ్విజయంగా పార్టీని నడిపారు. ఆ తరువాత అక్కడి ప్రాంతీయ రాజకీయాలను ప్రస్ఫుటంగా ప్రభావితం చేశాక ఇవాళ ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు.వాస్తవానికి తెలంగాణ ఏర్పాటువేళ ఆయన ఢిల్లీలో కొంత కాలం ఉండి కొన్ని పార్టీలతో పరస్పర సంప్రతింపులు జరిపారు.అటుపై ఆయన పెద్దగా అటు పోలేదు.ఓవిధంగా రాజశేఖర్రెడ్డిని ఢీ కొనలేకపోయినా, కొంత మేర సఫలీకృతం అయ్యారు.
చంద్రబాబు రాజకీయాలను మాత్రం అస్సలు అర్థం చేసుకోలేకపోయారు. ఇదే సమయంలో ఆ రోజు కేసీఆర్ కు కొంతలోకొంత వైఎస్సార్ మద్దతు ఉండేదన్న వాదన కూడా ఉంది.దీనిని కూడా కాదనలేం. తెర వెనుక రాజకీయంలో భాగంగా కథ నడిపారన్న వాదన కూడా ఉంది.అయితే వీటికి ఆధారాలు లేకున్నా కొంతలో కొంత కేసీఆర్ కు ఆ రోజు పెద్దాయన అండగా ఉండేవారు.శాసన సభలో ఈటెల రాజేందర్ లాంటి వారిని నిలువరించేందుకు ప్రయత్నించినా కూడా ప్రయివేటు సంభాషణల్లో మాత్రం వైఎస్ కు కేసీఆర్ కు మంచి బంధమే ఉంది. అది ఇవాళ కూడా జగన్ విషయమై కొనసాగుతోంది.
ఓ సందర్భంలో మహా కూటమి అంటూ చంద్రబాబుతో జట్టుకట్టిన కేసీఆర్ ఆ తరువాత పెద్దగా టీడీపీ పెద్దాయనను నమ్మలేదు.సమైక్యాంధ్ర అని ఓ రోజు, తెలంగాణ అని మరో రోజు వాదం వినిపించిన టీడీపీ,అదేవిధంగా తెలంగాణకు సమ్మతిస్తూ లేఖ ఇచ్చిన వైసీపీ ఇవన్నీ కూడా ఆ రోజు రాజకీయ ప్రయోజనంలో భాగంగానే కథ నడిపాయి. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటై ఏడేళ్లు పూర్తి అవుతున్న తరుణాన కొత్త పార్టీ అంటూ బయలు దేరారు కేసీఆర్. ఇది ఆయనకు విజయాన్ని ఇస్తుందో అంతకుమించిన ఆనందాలను పరిచయం చేస్తుందో అన్నది మహిమాన్విత కాలమే నిర్ణయించాలి.ఈ నేపథ్యంలో ఏ విధంగా చూసుకున్నా చంద్రబాబుకు కేసీఆర్ ఫ్యాక్టర్ అస్సలు కలిసిరాదు.. కానీ జగన్ కు అదే ప్లస్ పాయింట్.అందుకే టీడీపీలో గుబులు.. వైసీపీలో సంబరాలు కూడా!