తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంటక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇద్దరి నేతల మధ్య కీలక భేటీ జరగనుంది. రేవంత్ రెడ్డి పీసీసీ ఛీఫ్ అయిన తర్వాత తొలిసారిగా కోమటి రెడ్డితో భేటీ అయ్యారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారి తీసింది. మొదటి నుంచి పీసీసీ ఛీఫ్ నియామకంపై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాస్త అయిష్టంగానే ఉాన్నారు. వీరిద్దరు కలిసి ఒకే వేదికను పంచుకోవడం కూడా చాలా అరుదుగా చోటు చేసుకుంది. ఢిల్లీ పార్లమెంట్ సమావేశాల్లో, పీఏసీ మీటింగ్ లలో తప్పితే ఇద్దరు నేతలు పెద్దగా కలిసింది లేదు.
కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కనిపించలేదు. గతంలో రైతుల సమస్యలపై చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో మాత్రమే కోమటి రెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కలిసి వేదిక పంచుకున్నారు. తాజాగా వీరిద్దరి మధ్య భేటీలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు తొలిగిపోతాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారని తెలుస్తోంది.