ఏపీ గవర్నరుకు చంద్రబాబు లేఖ..నెమళ్ల జాతిని కాపాడండి !

-

కుప్పం ద్రవిడ యూనివర్సిటీ భూముల్లో అక్రమ మైనింగుపై గవర్నరుకు చంద్రబాబు లేఖ రాశారు. ద్రవిడ వర్శిటీ భూముల్లో అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణ విధ్వంసం, వన్యప్రాణులు మృతి చెందుతున్నాయని లేఖలో పేర్కొన్న చంద్రబాబు… అక్రమ మైనింగ్ కు ద్రవిడ యూనివర్సిటీ హబ్ గా మారిందని లేఖలో పేర్కొన్నారు. యూనివర్సిటీకి చెందిన 1100 ఎకరాల్లో వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారని.. ఇష్టానుసారంగా చేస్తున్న గ్రానైట్ బ్లాస్టింగ్, అక్రమ రవాణ కారణంగా వన్యప్రాణులు చనిపోతున్నాయని మండిపడ్డారు.

జాతీయ పక్షి నెమళ్లతో పాటు అరుదైన జంతుజాలం నశిస్తోందని.. వర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తూ అక్రమ మైనింగ్ కు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని ఆగ్రహించారు. విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత లోపించిందని.. ఇటీవలే వందల మంది అస్వస్థతకు గురయ్యారని మండిపడ్డారు. యూనివర్సిటీలో అంబులెన్స్ సౌకర్యం కూడా లేదని.. యూనివర్సిటీ ఉద్యోగులకు రెండేళ్ల నుంచి అలవెన్సులు కూడా ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో రోజురోజుకు యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటుంది… పేద విద్యార్థులకు హాల్ టిక్కెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ చర్యల కారణంగా ద్రావిడ యూనివర్శిటీ పరిశోధన వాతావరణం ప్రమాదంలో పడిందని.. వెంటనే గవర్నర్ జోక్యం చేసుకుని వర్సిటిలో అక్రమ మైనింగ్ ను అడ్డుకుని పర్యావరణం కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news