జగన్ ట్రాప్‌లో బాబు-పవన్…వర్కౌట్ అయితే ప్లస్సే…

-

జగన్‌ని ఎదురుకోవడానికి చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు ఏకం కానున్నారని ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరు కలిస్తే జగన్‌కు నష్టమే అని విశ్లేషణలు కూడా వస్తున్నాయి. గత ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు విడిగా పోటీ చేయడం వల్ల వైసీపీకి ప్లస్ అయింది. టి‌డి‌పి-జనసేనల మధ్య ఓట్లు చీలిపోయి వైసీపీ చాలా సీట్లలో విజయం సాధించింది.

కానీ ఈ సారి ఆ తప్పు జరగకుండా చూడాలని బాబు-పవన్‌లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో పవన్ దూకుడుగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. అటు పవన్‌పై వైసీపీ నేతలు ఓ రేంజ్‌లో ఎటాక్ చేస్తున్నారు. ఇక పవన్‌కు బాబు కూడా సపోర్ట్‌గా నిలుస్తున్నారు. అసలు ఇక్కడే బాబు-పవన్‌లు జగన్ ట్రాప్‌లో పడ్డారని తెలుస్తోంది. రాజకీయంగా విమర్శలు చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు.

కానీ పవన్ ఎప్పుడూలేని విధంగా కుల రాజకీయాలని తెరపైకి తీసుకొచ్చారు. సాధారణంగా కుల రాజకీయాలకు పవన్ దూరంగా ఉంటారు. అయితే ఈ సారి తన సొంత సామాజికవర్గం కాపు కులాన్ని భుజాన వేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. కాపులని ఐక్యం చేసి, జగన్‌కు దూరం చేయాలని ఫిక్స్ అయ్యారు. అలాగే కమ్మ కులానికి కూడా మద్ధతుగా ఉన్నట్లు చెప్పారు. అంటే కమ్మ-కాపు కులాలు కలిసి పనిచేస్తాయని పరోక్షంగా చెప్పినట్లైంది. అంటే బాబు-పవన్‌లు కలిసి పనిచేస్తారని క్లారిటీ వచ్చింది.

ఇక్కడే జగన్‌కు జరిగే నష్టం కంటే లాభం ఎక్కువ ఉంది. టి‌డి‌పి-జనసేనలు కలిస్తే వైసీపీకి కొంత నష్టం జరుగుతుంది. కానీ అంతకంటే ఎక్కువ లాభం జరిగేలా ఉంది. ఇప్పుడు కమ్మ-కాపు వర్గాలు ఓ వైపు ఉంటే జగన్ మిగిలిన బి‌సి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ, ఇతర ఓసీ కులాలని తనవైపుకు తిప్పుకుంటారు. దీని వల్ల జగన్‌కే ప్లస్. మొత్తానికైతే బాబు-పవన్‌లు హడావిడి చేసి ఇరుక్కుపోయేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news