2019 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కి టిడిపి పునాదులు కదిలి పోయాయి. దీంతో చంద్రబాబు నాయుడు తీవ్రంగా శ్రమిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఇరవై మూడు సీట్లకే పరిమితమైన గాని టీడీపీకి ఓటింగ్ శాతం బాగానే ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీని అన్ని విధాల ముందుకు నడిపించడం కోసం చంద్రబాబు ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర బాగానే చేస్తున్నారు. కానీ జగన్ సీఎం అయ్యాక ఎక్కడా కూడా ప్రభుత్వ వైఫల్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో త్వరలో రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను బలంగా ఎదుర్కోవటానికి చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర స్టార్ట్ చేశారు. ఈ యాత్ర తో జనం లోకి వెళుతూ రోడ్ షోలు నిర్వహిస్తూ జరగబోయే ఎన్నికలలో టిడిపి ఎక్కువ స్థానాలను గెలవడానికి అన్ని రకాల కృషి చేస్తున్నారు.
అయితే ప్రారంభించిన ప్రజా చైతన్య యాత్ర లో చంద్రబాబు తన సొంత పార్టీ నేతలను నమ్మలేనట్టు గా మాట్లాడటం ఆ పార్టీ నేతలకు విసుగు కలిగిస్తుంది. విషయంలోకి వెళితే ఇటీవల ప్రకాశం జిల్లాలో యాత్ర చేసిన సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ..‘ఏం తమ్ముళ్ళూ, మీలో కూడా కొందరు ఒక్క ఛాన్స్ అడిగిన జగన్‌కి ఓటేశారు కదా..’ అంటూ తెలుగు తమ్ముళ్ళనే ప్రశ్నించేశారు. ‘లేదు.. లేదు..’ అని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నా, ‘నాకు తెలుసు.. మీరు వైఎస్సార్సీపీకే ఓటేశారు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు..’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దీంతో రోడ్ షో లో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకు ఆ ప్రాంతం లోకల్ టిడిపి పార్టీ నాయకులు అయ్యాయ్యో ఎంత పని చేశారు చంద్రబాబు నాయుడు గారూ, మన వాళ్ళని మనమే నమ్మకపోతే ఎలాగా అని అటువంటి కామెంట్లు చేయొద్దని కోరినట్లు పార్టీలో టాక్.