తిరుపతి ఉపఎన్నిక: పగ ఎవరుతీర్చినా పర్లేదంటున్న బాబు.. వ్యూహం ఇదే!

-

2014, 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు దృష్టిలో జగన్ చాలా చిన్నోడు! అసలు బాబుతో పోటీపడటానికి ఎంట్రీ కార్డుకు కూడా అర్హత లేనోడు! జగన్ ని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు! అంటూ చంద్రబాబు తన సన్నిహితులవద్ద బీరాలు పోయేవారంట! కానీ… 2019 ఎన్నికల అనంతరం చంద్రబాబుకు జీవితానికి సరిపడా దెబ్బకొట్టారు జగన్! ఈ సమయంలో జగన్ పై పీకల వరకూ పగ పెంచేసుకున్నారు బాబు! ఇప్పుడు ఆ పగ ఎవరు తీర్చినా పర్లేదంటున్నారు!

అవును… జగన్ చంద్రబాబుని ఎన్ని రకాలుగా దెబ్బలు, కాదు కాదు చావు దెబ్బలు కొడుతున్నారనేది తెలిసిన విషయమే! గట్టిగా మాట్లాడితే బాబుకు ప్రతిపక్ష హోదా పోగొట్టడం కూడా జగన్ కు ఇప్పుడు పెద్ద మ్యాటర్ కాదు! దానికి కారణం జగన్ సగం అయితే… 2014 తర్వాత బాబు చేసిన పాలన మరోసగం! దాంతో జనం ఇచ్చిన పూర్తి బలంతో జగన్ చెలరేగిపోతున్నారు.. బాబును ఎగరేసి ఎగరేసి ఆడుకుంటున్నారు! బాబు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చిన్న అవకాశం కూడా ఇవ్వడం లేదు జగన్! ఈ సమయంలో తిరుపతి ఉప ఎన్నిక ను ఫుల్ గా, అన్ని రకాలుగా ఆడేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు బాబు!

అవును… 219 ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానం నుంచి గెలిచిన వైసీపీ అభ్యర్థి బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్ ‌రావు హ‌ఠాన్మర‌ణం చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ మ‌రి కొద్ది రోజుల్లో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ విషయంలో కాస్త రాజకీయ సాంప్రదాయం ప్రకారం ఈ ఎన్నికల్లో పోటీ చేయొద్దని టీడీపీ భావిస్తోంది. పోటీ చేసినా చూపించే ప్రభావం పెద్దగా ఉండకపోవడం కూడా ఒక కారణం! దాన్ని కప్పిపుచ్చుకోవడానికి “సాంప్రదాయం” ని వాడుతున్నారు బాబు!

ఇదే సమయంలో ఈ ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు విశ్లేషకులు! 2024 ఎన్నికలకు ఈ బైపోల్స్ ని వామప్ మ్యాచ్ గా భావిస్తోందంట బీజేపీ! దీంతో… కచ్చితంగా పోటీకి నిలబడే అవకాశాలున్నాయని అంటున్నారు.. పైగా అది మోడీకి కావాల్సిన ఎంపీ సీటు!! ఈ సమయంలో తనవల్ల ఎలాగూ కాదు కాబట్టి… ఈ ఉప ఎన్నికలో బీజేపీ అడిగిన అడగకపోయినా ఫుల్ మద్దతు ఇచ్చేయాలని బాబు ఫిక్సయ్యారంట! దానికి రెండు కారణాలు!

ఈ ఉప ఎన్నికలో బీజేపీ – జనసేనలకు తోడుగా టీడీపీ కూడా చేరితే వైకాపాను ఇరకాటంలో పెట్టోచ్చనేది బాబు ఒక వ్యూహం! ఆ ఎన్నిక ఫలితాల్లో ఏమైనా తేడా జరిగితే… ఆ ఫలితాలను జగన్ పాలనకు రెఫరెండంగా భావించి ఆటాడుకోవచ్చని! ఇదే సమయంలో అక్కడ బీజేపీ గెలిస్తే… బాబు ఫోన్ అమిత్ షా రిసీవ్ చేసుకుంటారేమో అని మరో ఆశ! మరి బాబు కంటున్న ఈ కలలు పగటి కలలుగా మిగిలిపోతాయా లేక ప్రస్తుతానికి ఎండమావులుగా కనిపిస్తాయా అనేది వేచి చూడాలి!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news