మస్ట్ రీడ్: రేవంత్ స్కూల్లో చంద్రబాబుకు పాఠాలు నీడ్!

-

ప్రస్తుతం ఏపీలో టీడీపీ ఉన్న పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సార్వత్రిక ఎన్నికల నుంచి మొదలు.. నేటి పరిషత్ ఎన్నికల వరకూ బాబుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఆ ప్రతీ దెబ్బా… చావుదెబ్బకు మార్గం చూపిస్తూనే ఉంది! ఈ క్రమంలో.. చంద్రబాబు.. తన శిష్యుడు రేవంత్ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవాలని చెబుతున్నారు విశ్లేషకులు.

chandrababu naiduఅవును… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పదేళ్లు కాంగ్రెస్ పవర్ లో ఉన్నప్పటికీ.. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలకు ఉనికే లేకుండా చేయటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. నోటుకు ఓటు పేరు చెప్పి టీడీపీని – తెలంగాణ ద్రోహులు అంటూ కాంగ్రెస్ ను దెబ్బ మీద దెబ్బ కొట్టారు. అది ఎంతలా అంటే… నోరు విప్పి ఘాటుగా స్పందించే లక్షణాన్ని కాంగ్రెస్ నేతలు మర్చిపోయేటంతాగా… తాము ప్రతిపక్షంలో ఉన్నామని, ప్రశ్నించే లక్షణాన్ని కలిగి ఉండాలనే విషయం మరిచిపోయేటంతగా!

కానీ… రేవంత్ టిపీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి కాస్త లెక్కలు మారాయి. తెరాస కూడా ఒక రాజకీయ పార్టీనే – కేసీఆర్ కు కూడా ఒక రాజకీయ నేతే తప్ప… పై నుంచి దిగిరాలేదనే సంకేతాలు కార్యకర్తల్లోకి పంపడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. జంకుబొంకు లేనట్లుగా ముఖ్యమంత్రి మొదలు ఎవరిపైనైనా సరే విరుచుకుపడిపోతున్నారు. వ్యూహాత్మకంగా వరుసపెట్టి యాక్టివిటీస్ ను అమలుచేయడంతో.. టీఆర్ఎస్ దళం మీద ఒత్తిడిని పెంచటం మొదలుపెట్టారు. దీంతో… ప్రస్తుతం తెలంగాణలో అధికారపార్టీకి రేవంత్ ఫీవర్ పట్టుకుందనే కామెంట్లకు స్థానం కల్పించారు.

ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిలానే ఉంది! ఏపీ అంటే జగన్ – జగన్ అంటే ఏపీ జనం అనే స్థాయిలో వాతావరణం ఉంది. బాబు వర్గం మీడియా ఎంత పోరాటం చేసినా… అది కాగితాలకే పరిమితం అవుతుంది తప్ప.. జనాల్లోకి రావడం లేదు. ఇలాంటప్పుడే రేవంత్ లాంటి ప్రణాళికలతో.. రేవంత్ లాంటి దూకుడుతో టీడీపీ అడుగులు వేయాలి.

ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే… ప్రస్తుతం ఏపీలో టీడీపీకి ఒక రేవంత్ రెడ్డి కావాలి. దూకుడు స్వభావం ఉండటంతోపాటు.. వ్యూహాత్మకంగా అడుగులువేసే నేత కావాలి.. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ.. ప్రజలకు అర్థమయ్యేలా మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే నాయకుడు కావాలి. జగన్ ను ఢీ కొనే శక్తి తమకు లేదనే భయం లేని నేత కావాలి! ఆపని చంద్రబాబు వల్ల అవుతుందా? చినబాబు కు సాధ్యమవుతుందా? బాబు & కో లే ఆలోచించుకోవాలి. రేవంత్ ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలి! అలాకానిపక్షంలో… ఇంతకాలం తెలంగాణలో కాంగ్రెస్ కు పట్టినగతే ఏపీలో టీడీపీకి మరో పదేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు!!

Read more RELATED
Recommended to you

Latest news