కేంద్ర బలగాలను దించండి : అమిత్ షా ను కోరిన చంద్రబాబు

-

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రతినిధి… పట్టాభి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై మరియు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ మరియు గంజాయి వ్యాపారం విపరీతంగా జరుగుతుందని.. కానీ ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తుంది అంటూ.. వైసీపీ సర్కార్ పై ఫైర్ అయ్యారు పట్టాభి. దీంతో రంగంలోకి దిగిన వైసిపి పార్టీ కార్యకర్తలు… పట్టాభి ఇల్లు, బాలకృష్ణ పార్టీ కార్యాలయం అలాగే మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసిపి నాయకులు దాడికి దిగారు.

 

టిడిపి కార్యాలయం వద్ద నిలిపి ఉంచిన వాహనాలపై కర్రలు మరియు ఇనుప రాడ్లతో దాడి చేశారు వైసీపీ నేతలు. దీంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో అక్కడ ఉన్న కొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ ఘటన తెలియగానే టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు… ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫోన్ చేశారు. వరుస దాడుల విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం కేంద్ర హోంశాఖ అధికారులతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై… వివరించారు. అంతేకాదు కేంద్ర బలగాల సహాయం కోరారు చంద్రబాబు నాయుడు. బలగాలు పంపేందుకు అటు కేంద్ర హోంశాఖ సానుకూలంగా స్పందించినట్లు టిడిపి వర్గాలు వెల్లడించాయి. అటు చంద్రబాబు హైదరాబాద్ నుంచి మంగళగిరి కాసేపటి క్రితమే చేరుకున్నారు. దాడి ఘటనలో గాయపడిన వారిని పరామర్శించారు చంద్రబాబు. ఇక ప్రస్తుతం ఏపీ లోని టిడిపి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version