జూనియ‌ర్‌కు పోటీగా బాబు అదిరిపోయే స్కెచ్‌

-

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి వ్యూహం వేయాలో? ఎప్పుడు ఎలా పార్టీని ముందుకు న‌డిపించాలో..? టీడీ పీ అధినేత చంద్ర‌బాబుకు కొట్టిన పిండి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతు న్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల నాలుగు రోజుల కింద‌ట టీడీపీని టార్గెట్ చేస్తూ.. ఆ పార్టీకే చెందిన మాజీ నాయ‌కుడు, ప్ర‌స్తుతం ఆపార్టీ టికెట్‌పైనే విజ‌యం సాధించిన ఎమ్మెల్యే కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో పార్టీని అధికారంలోకి తెచ్చుకునేందుకు జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి తెచ్చిన చంద్ర‌బాబు యాక్సిడెంట్ అయి ఆసుప‌త్రి పాలైనా కూడా వ‌దిలి పెట్ట‌కుండా ఆసుప‌త్రి బెడ్‌పై నుంచే ప్ర‌చారం చేయించుకున్నార‌ని అన్నారు.

పార్టీ ఓడిపోయిన త‌ర్వాత చంద్ర‌బాబు త‌న అనుకూల మీడియాలో జూనియ‌ర్ ఎన్టీఆర్ తిరిగి ప్రాంతాల మ్యాప్‌తో స‌హా ప్ర‌చురించి ఆయ‌న వ‌ల్లే పార్టీ ఓడిపోయింద‌ని, జూనియ‌ర్ తిరిగి ప్ర‌చారం చేసిన ప్రాంతా ల్లో ఓట్లు కూడా ప‌డ‌లేద‌నే యాంటీ ప్ర‌చారం చేయించార‌ని విరుచుకుప‌డ్డారు. అంటే ఒక‌ర‌కంగా త‌న కొ డుకు లోకేష్ కోసం జూనియ‌ర్‌ను చంద్ర‌బాబు తొక్కేశార‌నే వాద‌న‌ను మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్ల భ‌నేని వంశీలు బ‌లంగా వినిపించాయి. దీంతో రాజ‌కీయంగా ఒక్క‌సారిగా టీడీపీలో కుదుపు ఏర్ప‌డింది. జూనియ‌ర్ ఎన్టీఆర్ కేంద్రంగానే టీడీపీ రాజ‌కీయాలు సాగాలా? అనే చర్చ కూడా జ‌రిగింది.

ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ఔట్ డేటెడ్ అయిపోయార‌ని, ఆయ‌న వార‌సుడు లోకేష్ కూడా విఫ‌ల‌మైన నాయ కుడిగా మిగిలిపోయార‌నే ప్ర‌చారం జరుగుతోంది. అంటే ఇక‌, టీడీపీ పుంజుకోవాలంటే.. ఖ‌చ్చితంగా మ‌ళ్లీ జూనియ‌ర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందేనా? అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బా బు త‌న వ్యూహానికి ప‌దును పెట్టారు. కొంచెం ఆల‌స్య‌మే అయినా.. అనూహ్యంగా నంద‌మూరి కుటుంబానికే చెందిన అన్న‌గారు కుమారుడు జ‌య‌కృష్ణ వార‌సుడు చైత‌న్య కృష్ణను రంగంలోకి దింపారు. “మా మేన మామ‌(చంద్ర‌బాబు)ను ఇష్టానుసారం మాట్లాడితే.. ఊరుకునేది లేదం“టూ.. ఆయ‌న నిన్న‌టికి నిన్న వేటు చూపించి మ‌రీ వంశీకి, కొడాలికి వార్నింగ్ ఇచ్చారు.

దీనికి సంబంధించిన సెల్ఫీ వీడియో ను చైతన్య కృష్ణ విడుద‌ల చేయ‌డంతో రాజ‌కీయంగా పెను దుమా రం రేపింది. జూనియ‌ర్‌ను ప‌క్క‌న పెట్టేలా .. చంద్ర‌బాబు చైత‌న్య‌ను రంగంలోకి తీసుకువ‌చ్చార‌నే ప్ర‌చారం కూడా సాగుతోంది. చైత‌న్య వాయిస్ కూడా ఒకింత మాస్‌గానే ఉండ‌డం, ఆయ‌న హావ భావాలు కూడా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలానే ఉండ‌డంతో అంద‌రూ ఇప్పుడు బాబు వ్యూహం ఇదేనా? అనిభావిస్తున్నారు. నిజానికి తెలంగాణ ఎన్నిక‌ల్లోనూ, ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ నంద‌మూరి వార‌సులు ప్ర‌చారం చేశారు.

తెలంగాణ‌లో నంద‌మూరి హ‌రి కుమారుడు నంద‌మూరి క‌ళ్యాణ్, ఏపీ ఎన్నిక‌ల్లో నంద‌మూరి తార‌క్ ర‌త్నలు ప్ర‌చారం చేశారు. అయితే, వీరు ఎక్క‌డా స‌క్సెస్ కాలేదు. పైగా వీరు లోకేష్‌కు కూడా పోటీ కాదు. ఇక‌, ఇప్పుడు చైత‌న్య‌ను రంగంలోకి దింపితే.. బాగుంటుంద‌నే బాబు వ్యూహం స‌క్సెస్ అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news