ఏపీ రాజకీయాల్లో ఎంతో చాకచక్యంగా వ్యవహరించే చంద్రబాబు నాయుడు ఆయనకు ఇప్పుడు బంగారం లాంటి అవకాశం వచ్చినా కూడా దాన్ని వదులుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అదేనండి ఇప్పడు ఏపీలో అన్ని రాజకీయ పార్టీలకు సవాల్‌గా మారిన విశాఖ ఉక్కు కంపెనీని ప్రయివేటీకరించడంపై ఇన్ని రోజులు ఎలాటి రాజీనామాలకు దిగని చంద్రబాబు నాయుడు ఇప్పుఏడు ఆలస్యంగా ఓ నిర్ణయం తీసుకున్నారు.
chandrababu
అదేంటంటే ఈ అంశంపై అవసరమైతే రాజీనామాలు చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించి సంచలనం రేపారు. కాగా ఈ మేరకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితికి కన్వీనర్ గా పనిచేస్తున్న నేతకు ఏకంగా లేఖ కూడా రాసి తన వివరణ ఇచ్చారు. అయితే ఈ నిర్ణయంపై ఇప్పుడు చాలా రకాల విమర్శలు వస్తున్నాయి. అదేంటంటే ఈ విధంగా ఇదివరకే ఎందుకు నిర్ణయం తీసుకోలేదనే వాదన వస్తోంది.
ఎందుకంటే తమ ఎమ్మెల్యే రాజీనామా చేసిన వెంటనే మిగతా ప్రజాప్రతినిధులతో కూడా రాజీనామాలు చేయించి ఉంటే టీడీపీపై, చంద్రబాబుపై ప్రజల్లో మంచి నమ్మకం వచ్చేదని, కానీ ఇలా చేయడంతో ఆయన్ను ఎవరూ నమ్మలేరనే వాదన వస్తోంది. ఎందుకంటే ఈ విషయంలో ఇప్పటికే వైసీపీ ఏకంగా పార్లమెంటులో కూడా కొట్లాడుతోంది. కానీ టీడీపీ ఎంపీలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. దీంతో ఆయన కేవలం స్టేట్ మెంట్ల వరకే పరిమితమవుతారని, యాక్షన్‌కు దిగరనే వాదన చంద్రబాబుపై వస్తోంది. నిజంగా ఇప్పటికే ఈ పని చేసి ఉంటే ఎంతో ప్లస్ అయి ఉండేదని తెలుస్తోంది.