ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. కొత్తగా మరో 14,565 సీట్లకు అనుమతి లభించడం, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యంతో ఈ మార్పులు జరిగాయి. రేపు, ఎల్లుండి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈనెల 9న వెరిఫికేషన్ ఉంటుంది. 12 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు పొడగించారు. 16న తొలి విడత, 24న రెండో విడత, ఆగస్టు 4న తుది విడత కౌన్సెలింగ్ ఉంటుంది.
ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్..
జులై 7 – 8 – ఆన్లైన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి తేదీ, సమయం ఎంచుకోవాల్సి ఉంటుంది.
జులై 9 – స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
జులై 12 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
జులై 12 – ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.
జులై 16 – సీట్ల కేటాయింపు.
జులై 16 – 22 – సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మధ్యలో ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
సెకండ్ ఫేజ్ షెడ్యూల్..
జులై 24 – 25 – ఆన్లైన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి తేదీ, సమయం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫస్ట్ ఫేజ్‌లో ఈ వివరాలు నింపని విద్యార్థులు మాత్రమే).
జులై 26 – స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
జులై 24 – జులై 27 – సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
జులై 27 – ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.
జులై 31 – సీట్ల కేటాయింపు
జులై 31– ఆగస్టు 2 – సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మధ్యలో ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్
ఆగస్టు 4 – ఆన్లైన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ నింపాలి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి తేదీ, సమయం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లో ఈ వివరాలు నింపని విద్యార్థులు మాత్రమే).
ఆగస్టు 5 – స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ తేదీల మధ్యలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
ఆగస్టు 4 – ఆగస్టు 6– సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఆగస్టు 6 – ఆప్షన్స్‌ను ఫ్రీజింగ్ చేసుకోవాలి.
ఆగస్టు 9 – సీట్ల కేటాయింపు.
ఆగస్టు 9 – ఆగస్టు 11 – సీట్లు పొందిన విద్యార్థులు ఈ తేదీల మధ్యలో ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.