పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ నెల 7వ తేదీన విడుదల అవ్వనున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలియచేశారు. ఫలితాలను www.bse.telangana.gov.in, results.bsetelangana.org అనే వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు అని తెలిపారు. టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 14 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించిన సంగతి అందరికి తెలిసిందే.
గత నెల జూన్ జూన్ 14 నుండి 22 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి 259 పరీక్షా కేంద్రాల్లో 71వేల 738 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఫలితాలు ఆదివారం(జులై 2) విడుదల అయ్యాయి. ఈసెట్ పరీక్షను జూన్ 20వ తేదీన నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 103 పరీక్షా కేంద్రాలు, హైదరాబాద్‌లో రెండు కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 38,255 మంది దరఖాస్తు చేసుకోగా… 28,640 మంది బాలురు, 9,615 మంది బాలికలు ఉన్నారు. ఏపీ ఈసెట్ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. పాలిటెక్నిక్, బీఎస్సీ (మ్యాథ్స్) ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ (బీఈ, బీటెక్, బీఫార్మసీ) రెండో సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి ఈసెట్ పరీక్షను నిర్వహించారు.