అరుగులా ఆకుతో మధుమేహానికి చెక్ పెట్టండి..!!

-

ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్ వల్ల బాగా వినపడే సమస్య డయాబెటిస్. చిన్న, పెద్ద తేడా లేకుండా డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.. లేకుంటే డయాబెటిస్ వచ్చిందంటే జీవితం మొత్తం మందులు వాడుతుండాలి. ఇలా వాడుతున్నప్పటికి షుగర్ లెవల్స్ ఒక్కోసారి పెరిగి అనేక సమస్యలు తెచ్చిపెడుతుంది.అలా మందులు వాడుతూ డయాబెటిస్ నియంత్రణలో ఉంచుకోవడానికి కొన్ని రకాల ఆయుర్వేద ఔషదాలను వాడితే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తుంటారు.

ఇదివరకు వేసుకొనే మందులు బాగా పనిచేసివి..ఇప్పుడు ఎక్కువ డోస్ కి వెళ్లకుండా.. డయాబెటిస్ నియంత్రణలో ఉంచే గుణాలు అరుగులా ఆకులో పుష్కళంగా ఉన్నాయి.ఎటువంటి మధుమేహులుకయినా చాలా బాగా సహాయపడుతుంది.

అరుగులా ఆకు మంచి సువాసనతో, కొంచెం చేదుగా ఉంటుంది.ఇందులో విటమిన్స్ ఏ,కె, బీ9, సి, ఐరన్, మెగ్నీషియం, అయోడిన్, కాల్షియం మరియు పొటాషియం ఉంటాయి.విటమిన్ K రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ మరియు ఇన్సులిన్ మెరుగుపరచడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్స్, కూడా సమృద్దిగా ఉండుట వలన రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ నీ క్రమభద్దీకరిస్తుంది.

అలాగే ఈ ఆకులలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉండుట వలన సాదరణంగా మధుమేహ కలిగిన వారిలో ఉండే బ్లడ్ ప్రెజర్నీ తగ్గిస్తుంది.అరుగుల జీర్ణశయాంతర ప్రేగు యొక్క పనిని మెరుగుపరుస్తుంది. ఇది పొట్టలో హానికరమైన సూక్ష్మజీవులు మరియు వైరస్లతో పోరాడుతుంది.అరుగుల.. మూత్రవిసర్జన వంటి సమస్యలతో బాధపడేవారికి మంచి టానిక్ గా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్లు రక్త నాళాల గోడలను బలోపేతం చేస్తాయి.మెదడు నరాలపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఏదైనా పనిమీద త్వరగా దృష్టి పెట్టడానికి.. మెదడుకి సహాయపడుతుంది.

అరుగుల ఆకులను నేరుగా తినవచ్చు. లేదా జ్యూస్ గా తయారుచేసుకొని తాగవచ్చు.అంతేకాకుండా ఈ ఆకులను సలాడ్ వంటి వాటిలో వేసుకొని కూడా తీసుకోవచ్చు.ఈ ఆకులను తీసుకొనే ముందు ఒక్కసారి ఆయుర్వేద వైధ్య నిపుణులు సలహా తీసుకోవటం చాలా మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news