సత్తెనపల్లిలో పవన్..అంబటికి చెక్.!

-

అధికారం కాదు కదా..కనీసం ప్రతిపక్షంలో లేకపోయినా సరే జనసేన అధినేత పవన్ కల్యాణ్…నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ..వారికి అండగా ఉంటున్న విషయం తేలిసిందే. సొంత డబ్బులు సైతం ఖర్చు పెడుతూ..ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ముఖ్యంగా కౌలు రైతులకు అండగా ఉంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా కౌలు రైతులని ఆదుకున్న దాఖలాలు లేవు. దీంతో మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేస్తున్నారు. ఇప్పటివరకు పలు జిల్లాల్లో కౌలు రైతులని ఆదుకున్నారు.

ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలని ఆదుకునేందుకు పవన్ వెళుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 200 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. వీరి కుటుంబాలకు సత్తెనపల్లి వేదికగా జరిగే కార్యక్రమంలో కుటుంబానికి లక్ష రూపాయిలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు. అయితే సత్తెనపల్లి మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం. ఇక అంబటి…పవన్ టార్గెట్ గా ఎలాంటి విమర్శలు చేస్తున్నారో తేలిసిందే.

అయితే ఇప్పుడు పవన్..సత్తెనపల్లికి వెళ్ళి..అంబటి టార్గెట్ గా ఎలాంటి రాజకీయం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న అంబటికి చెక్ పెట్టాలని చెప్పి జనసేన శ్రేణులు గట్టిగా ట్రై చేస్తున్నాయి. సత్తెనపల్లిలో కొంతమేర జనసేనకు బలం ఉంది. గత ఎన్నికల్లో జనసేనకు ఓటు వేయడం వల్ల గెలవదని, కాబట్టి ఓటు తనకు వేయాలని చెప్పి అంబటి రిక్వెస్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో కొంత మేర జనసేన శ్రేణులు అంబటి వైపుకు వెళ్లారు. ఇక అంబటి గెలిచారు..మంత్రి కూడా అయ్యారు. మంత్రి అయ్యాక పవన్‌ని ఏ విధంగా టార్గెట్ చేశారో తెలిసిందే.

దీంతో జనసేన శ్రేణులు..అంబటిని ఓడించాలనే కసితో ఉన్నాయి. ఇప్పుడు పవన్ సత్తెనపల్లికి వస్తుండటంతో..అక్కడ జనసేనలోకి చేరికలు జరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే జనసేనకు సింగిల్ గా సత్తెనపల్లిలో వైసీపీకి చెక్ పెట్టే బలం లేదు. టీడీపీతో పొత్తు ఉంటేనే వైసీపీని నిలువరించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news