తాత ఇచ్చిన ఐడియా..కరెంట్ బిల్లులకు చెక్..

-

వామ్మో..సమ్మర్ అంటే చాలు అందరికి భయం పట్టుకుంది..సూర్యుడి వేడి ఒకవైపు..కరెంట్ బిల్లుల మోత మరో వైపు ఉంటుంది.ఫ్యాన్ లేనిదే కనీసం అర సెకను కూడా ఇంట్లో ఉండ లేరు..ఎండ వేడిని ఉపయోగించి పవర్ కూడా కొంత మంది తయారు చేస్తున్నారు..అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది..సూర్యుడి వేడి, తాత ఐడియా తో కరెంటు బిల్లును తగ్గించాడు..అదేలా సాధ్యం అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు కదూ..ఓసారి ఆ వింత గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

 

బెంగళూరుకి చెందిన పృధ్వీ మంగిరి అనే యువకుడు మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అయితే అతడికి డ్రమ్స్ వాయించడం అంటే చాలా చాలా ఇష్టం. డ్రమ్స్ వాయించడాన్నే కెరీర్‌ కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. తన నైపుణ్యాన్ని మరింత మెరుగుపర్చుకుని జీవితంలో ఎదగాలనే లక్ష్యంతో ఇంట్లోనే డ్రమ్స్ ప్రాక్టీస్ చేసేవాడు. అయితే డ్రమ్స్ శబ్దాలను ఇరుగుపొరుగువారు భరించలేకపోయేవారు. పొద్దున, సాయంత్రం శబ్దాలతో ఇబ్బందులకు గురయ్యేవారు.ఇక ముసలి వాళ్ళు, పిల్లలు అయితే అసలు నిద్ర పోయే వాళ్ళు కాదు..అందరూ వచ్చి ఫిర్యాదు చెయ్యడం తో తన ఇష్టాన్ని వదిలేసాడు.

ఈ క్రమంలో సౌండ్ ఫ్రూప్ గదిని నిర్మించాలని ఫిక్స్ అయ్యారు.జనాల నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదని ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. అనుకున్నట్టుగానే చకచకా ‘సౌండ్ ఫ్రూఫ్’ రూంని సిద్ధం చేశారు. ఇంకే.. ప్రాక్టీస్ బాగానే ఉంది. జనాల పోరు లేకుండా పోయింది. అయితే అసలు సమస్య ఇక్కడ పుట్టింది. మూసివున్న గదిలో డ్రమ్స్ వాయింపు కారణంగా అధిక ఉష్ణం వెలువడేది. ఈ సమస్యను అధిగమించేందుకు ఏసీని విస్తృతంగా వినియోగించాల్సి వచ్చేది. ఫలితంగా పృధ్వీ పెద్ద మొత్తంలో కరెంట్ బిల్లులు కట్టాల్సి వచ్చిందీ. ఏ స్థాయిలో అంటే నెలకు కనీసం రూ.1500 నుంచి గరిష్ఠంగా రూ.7 వేల వరకు బిల్లు వచ్చేధి దాంతో మరో ఆలోచన చేశారు.

ఎలాగైనా బిల్లును తగ్గించాలని మరో ప్లాను వేశారు.మనువడు పృధ్వీకి చెప్పాడు. అనుకున్నదే తడవుగా బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్‌కి దరఖాస్తు చేసుకున్నారు. విద్యుత్‌ అవసరాలకు తగిన ప్యానెల్స్ బిగించుకునేందుకు అనుమతి వచ్చింది. 5 కిలోవాట్ల సోలార్ ఉత్పత్తి ప్యానెల్స్ బిగించుకునేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్యానెల్స్ ద్వారా ప్రతి నెలా 5కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా ఇందులో 2.5-3కిలోవాట్లు మాత్రమే పృధ్వీ వినియోగానికి సరిపోతోంది.మిలిగిన దానిని కర్ణాటక ప్రభుత్వానికి అమ్మే వారు..400-600 మధ్య స్వల్ప ఆదాయాన్ని కూడా పొందుతున్నాడు. ప్రస్తుతం జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఇంట్లోనే డ్రమ్స్ ప్రాక్టీస్ చేస్తూ తన లక్ష్యం వైపు దూసుకెళ్తున్నాడు…ఇది అతని సక్సెస్ స్టోరీ..

Read more RELATED
Recommended to you

Latest news