కేసీఆర్‌.. బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా?: బండి సంజయ్

-

సీఎం కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల పాలన విజయాలపై శుక్రవారం కూకట్‌పల్లిలో బీజేపీ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ పాలనపై పలు విమర్శలు చేశారు.

బండి సంజయ్
బండి సంజయ్

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్‌వైపు చూస్తున్నాయంటే ప్రధాని మోడీ చేసిన కృషి వల్లేనని అన్నారు. అన్ని దేశాలకు రోల్ మోడల్‌గా భారత్ నిలిచిందన్నారు. నిరుద్యోగులకు న్యాయం చేస్తోందని, ప్రతి ఏడాది నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులను అండగా నిలుస్తోందన్నారు. అలా ఎంతో విజయవంతంగా ప్రధాని మోడీ పాలన 8 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నారన్నారు. కానీ, ఇన్నేళ్లలో సీఎం కేసీఆర్ చేసింది ఏముందన్నారు. తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు సొంతమన్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తామని, ఇంటికొక గవర్నమెంట్ జాబ్ వచ్చేలా చూస్తామని కేసీఆర్ చెప్పిన మాటలు.. తన ఇంటికే పరిమితమయ్యాయన్నారు. గడీల పాలనలో తెలంగాణ తల్లి బంధి అయిందని, బీజేపీతోనే దానికి విముక్తి లభిస్తుందన్నారు. బీజేపీతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మోదీ పాలనపై, సీఎం కేసీఆర్ పాలనపై బహిరంగ చర్చ పెడదామని, దమ్ముంటే సీఎం కేసీఆర్ చర్చకు రావాలని బండిసంజయ్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news