పెట్రోల్, డిజిల్ రేట్లను తగ్గింపు.. కీలక నిర్ణయం తీసుకున్న మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రం

-

ఇటీవల దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం సామాన్యుడికి తీపి కబురు చెప్పింది. సామాన్యుడిని వేధిస్తున్న పెట్రోల్, డిజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. లీటర్ డిజిల్ పై రూ. 10, పెట్రోల్ పై రూ.5 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, ఉత్తరాఖండ్, అస్సాం, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలు డిజిల్, పెట్రోల్ పై వ్యాట్ ను తగ్గించాయి. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ తో పాటు ఇతర రాష్ట్రాలల్లో కూడా రేట్లు తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం చత్తీస్ గడ్ రాష్ట్రం కూడా పెట్రోల్, డిజిల్ రేట్లను తగ్గించనుంది. ఇంతకు ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన పంజాబ్ పెట్రోల్ , డిజిల్ రేట్లను తగ్గించింది. పంజాబ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ కీలక  నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన చత్తీస్గడ్ ప్రభుత్వం కూడా రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. చత్తీస్ గడ్ లో లీటర్ పెట్రోల్ పై 1 శాతం వ్యాట్ ను, డిజిల్ పై 2శాతం వ్యాట్ ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.  ఈ నిర్ణయం వల్ల రాష్ట్రానికి రూ. 1000 కోట్ల నష్టం వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news