పార్లమెంట్ ఎన్నికల వేళ కీలకపరిణామం.. కాంగ్రెస్ లోకి కీలక నేత జంప్..!

-

ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్ర రాజకీయాల్లో హోరాహోరీగా మారుతున్నాయి. మరో వారం రోజుల్లో పొలింగ్ జరగనున్న వేళ టీ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హుస్నాబాద్ బీజేపీ ఇంచార్జి, ఏపీ హౌస్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయనతో పాటు మరికొంత మంది నేతలు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి వీరిని కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బొమ్మ శ్రీరాం చక్రవర్తి తండ్రి, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు ఐదు దశాబ్దాలపాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో కీలక నాయకుడిగా ఎదిగారు. ఆయన రాజకీయ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఎచ్చిన శ్రీరాం చక్రవర్తి హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ పై ఆశలు పెట్టుకొని గతంలో నియోజకవర్గ ఇన్చార్జిగా పని చేశారు. అయితే గతంలో పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన ప్రవీణ్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో బొమ్మ శ్రీరాం చక్రవర్తి అసంతృప్తితో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news