భారత్, అమెరికా సంయుక్త సైనిక వ్యాయామం ‘యుధ్ అభ్యాస్’ 18వ ఎడిషన్ ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో జరుగుతున్నది. భారత్, చైనా సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ప్రారంభమైన ఈ సైనిక విన్యాసాలు రెండు వారాలు కొనసాగనున్నాయి. అయితే దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్, చైనా సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ప్రారంభమైన ఈ సైనిక విన్యాసాలు రెండు వారాలు కొనసాగనున్నాయి. పాకిస్థాన్ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ ఈ మేరకు సమాధానమిచ్చారు.
భారత్, చైనా మధ్య పరస్పర విశ్వాసానికి ఈ విన్యాసాలు వ్యతిరేకమని అన్నారు. మరోవైపు ఈ ఒప్పందాలను ఉల్లంఘించిన చైనా 2020 మేలో లడఖ్‌లోని గాల్వాన్ లోయ వద్ద భారీగా సైనికులను మోహరించింది. కీలకమైన సైనిక స్థావరాలను ఆక్రమించేందుకు ప్రయత్నించింది. ఈ సందర్భంగా ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరువైపులా ప్రాణనష్టం జరిగింది. దీంతో సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో భారత్, చైనా పోటాపోటీగా సైనిక బలగాలను మోహరించాయి.