‘ఘరానా మొగుడు’ చిత్రం తర్వాత చిరంజీవి సాధించిన అరుదైన రికార్డు ఇదే..

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి త్వరలో ‘గాడ్ ఫాదర్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే విడుదలైన ఫిల్మ్ ట్రైలర్ మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ ను అలరిస్తున్నది. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ పిక్చర్ రికార్డులను తిరగరాస్తుందని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, చిరంజీవి అప్పట్లోనే క్రియేట్ చేసిన అరుదైన రికార్డు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్టీ రామారావు తర్వాత తెలుగు చిత్ర సీమలో నెంబర్ వన్ హీరోగా చిరంజీవి ఎదిగారు. ఎన్టీఆర్ సీనియర్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా చిరంజీవి ఉండిపోయారు. ఈ క్రమంలోనే 1990ల్లో చిరంజీవి అరుదైన రికార్డు సొంతం చేస్తున్నారు. ‘ద వీక్’ మ్యాగజైన్ వారు అప్పట్లో ప్రచురించిన కథనం ప్రకారం..చిరంజీవి తీసుకున్న రెమ్యునరేషన్ రూ..కోటి 20 లక్షలు అని పేర్కొన్నారు.

‘బిగ్గర్ దెన్ బచ్చన్’ అనే శీర్షికతో 1992 సెప్టెంబర్ నెలలో ప్రచురించిన స్టోరి ప్రకారం..మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ బిగ్ బీ అమితా బ్ బచ్చన్, సూపర్ స్టార్ రజనీకాంత్ ల కంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారని పేర్కొన్నారు.

ఆ విషయం తెలుసుకుని మెగా అభిమానులతో పాటు సినీ ప్రియులు, తెలుగు వారు సంతోషం వ్యక్తం చేశారు. 1990ల్లో చిరంజీవి నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధించాయి. ‘ఘరానా మొగుడు’ చిత్రం అయితే కొన్ని సెంటర్లలో వందకు పైగా రోజులు ఆడింది. అలా ఈ చిత్రం తర్వాత చిరంజీవి అరుదైన రికార్డు తన పేరు మీద నమోదు చేసుకున్నారు.

దేశంలోనే ఇంతటి గొప్ప పేరును చిరంజీవి సొంతం చేసుకున్నారని తెలుగు ప్రజలు ఆనందపడిపోయారు. స్వయం కృషికి కేరాఫ్ అయిన చిరంజీవి ఇంతటి గొప్ప వ్యక్తని, భవిష్యత్తులో సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు అవుతారని అప్పట్లో పలువురు సినీ ప్రముఖులు అన్నారు. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ ఫిల్మ్ విజయ దశమి కానుకగా విడుదల కానుంది. ఆ తర్వాత చిరంజీవి ‘భోళా శంకర్’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news