‘అడవి దొంగ’గా చిరంజీవి అరుదైన రికార్డు..ఏమిటంటే?

-

స్వయంకృషితో తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ గా ఎదిగిన వ్యక్తి చిరంజీవి. నిజాయితీగా కష్టపడి తనకంటూ ఓ ప్రత్యేమైన స్థానం ఏర్పరుచుకున్న చిరంజీవి..తొలినాళ్ల నుంచి ఇప్పటి వరకు కష్టపడుతూనే ఉన్నారు. ఇటీవల ‘ఆచార్య’గా ప్రేక్షకులను పలకరించిన చిరు..తర్వలో ‘గాడ్ ఫాదర్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే..మెగాస్టార్ తన సినిమాలతో అరుదైన రికార్డులు సృష్టించారు. ‘అడవి దొంగ’ పిక్చర్ తో ఆయన క్రియేట్ చేసిన రికార్డుల గురించి స్పెషల్ ఫోకస్..

‘సుప్రీమ్’ హీరోగా మొదట్లో తన టైటిల్ వేసుకున్న చిరంజీవి..ఆ తర్వాత మెగాస్టార్ అయిపోయారు. 1980 వ దశకంలో ఆయన నటించిన చిత్రాలు ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. అలా వచ్చిన పిక్చర్స్ లో ‘అడవి దొంగ’ ప్రత్యేకం. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ పిక్చర్ ఇది. కాగా, ‘విజేత’ తర్వాత రిలీజ్ అయింది.

ఇందులో ఫస్ట్ హాఫ్ మొత్తం చిరంజీవి మూగవాడిలాగా కనిపిస్తాడు. కానీ, సెకండ్ హాఫ్ లో తన నట విశ్వరూపం చూపించేస్తారు. డ్యాన్స్ తో జనాలను ఉర్రూతలూగిస్తారు. కమర్షియల్ హీరోగా మెగాస్టార్ ను ఎస్టాబ్లిష్ చేసిన పిక్చర్ ‘అడవి దొంగ’ అని చెప్పొచ్చు. ఈ ఫిల్మ్ ను హైదరాబాద్ లోని చాలా థియేటర్లలో ఐదు షోలుగా ప్రదర్శించారు. అలా ఈ చిత్రం అరుదైన రికార్డు సృష్టించింది. ఇందులో చిరంజీవి అభినయం చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news