Breaking : మోడీకి సీఎం కేసీఆర్‌ సవాల్‌.. దమ్ముంటే తీసుకురా అంటూ..

-

గత మూడు రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సమీక్ష సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. అయితే అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో.. బీజేపీ నేతలపై, కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. దమ్ముంటే ఏక్ నాథ్ షిండే లాంటి వాన్ని తెలంగాణలో తీసుకు రా మోడీ అంటూ సవాల్‌ విసిరారు సీఎం కేసీఆర్‌. నీ ఉడత ఊపులకు ఎవరు భయపడరంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ ఏక్‌నాథ్‌ షిండే తరహాలో ఆనాడు కాంగ్రెస్ కూడా ఎన్టీ రామారావుపై నాదెండ్ల భాస్కర్‌ను ప్రయోగించిందని కేసీఆర్ తెలిపారు.

Modi vs KCR: ప్రధాని మోదీ వర్సెస్‌ సీఎం కేసీఆర్‌.. ఇద్దరి మధ్య గ్యాప్‌  పెరుగుతుందా..? పెంచుతున్నారా? | Telangana CM KCR bridges trust gap with PM  Narendra Modi | TV9 Telugu

తర్వాత ప్రజలే తిరగబడి మళ్లీ ఎన్టీఆర్‌ను తెచ్చుకున్నారని గుర్తు చేశారు. నరేంద్ర మోదీకి దమ్ముంటే తమిళనాడు, తెలంగాణలో ఏక్‌నాథ్ షిండేలను తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. 75 ఏళ్ల రొటీన్ పాలిటిక్స్ నుంచి దేశం బయటకు రావాలన్న కేసీఆర్‌.. అప్పుడే దేశంలో ప్రబలమైన మార్పులు వస్తాయన్నారు. అంతేకాకుండా.. అవసరమైన రీతిలో రాజ్యాంగాన్ని మార్చుకోవాలంటూ మరోసారి రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేశారు. నేనెవరికీ భయపడను.. నాకు మనీ లేదు.. లాండరింగ్ లేదు.. మాతో గోక్కుంటే అగ్గే.. మీరు మాతో గోక్కున్నా.. గోక్కోపోయినా దేశ ప్రజల కోసం నేను మిమ్మల్ని గోకుతూనే ఉంటా అంటూ
వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news