సినిమా బిడ్డగానే జగన్‌ దగ్గరకు వెళుతున్నా : చిరంజీవి

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డితో ఇవాళ టాలీవుడ్‌ స్టార్‌ హీరో, మెగాస్టార్‌ చిరంజీవి భేటీ కానున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌ నుంచి ఉదయం 11 గంటల సమయంలో ఏపీకి బయలు దేరిన చిరంజీవి… కాసేపటి క్రితమే… విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లోనే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ చిరంజీవి భేటీ కానున్నారు.

ఏపీలో సినిమా టికెట్ల విషయంపై సీఎంతో చర్చించనున్నారు చిరంజీవి. అయితే.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న చిరంజీవి,.. మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆహ్వానం మేరకు ఇండస్ట్రీ బిడ్డగా ఏపీకి వచ్చానని ప్రకటన చేశారు. సీఎం జగన్‌తో అన్ని విషయాలపై చర్చిస్తా.. మరో గంటన్నరలో అన్ని అంశాలపై క్లారిటీ ఇస్తానని స్పష్టం చేశారు చిరంజీవి.