టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR ఫిల్మ్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ప్రజెంట్ ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో Rc 15 ఫిల్మ్ చేస్తున్నారు. ఈ పిక్చర్ అప్ డేట్ కోసం మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ చిన్న తనం గురించి చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రామ్ చరణ్ చిన్న తనంలో తను నటించిన ఆ సినిమా చూపిస్తేనే అన్నం తినేవాడని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. అలా చాలాకాలం పాటు ఆ సినిమా చూపిస్తూ రామ్ చరణ్ కు అన్నం తినిపించినట్లు తెలిపారు చిరు. ఆ ఫిల్మ్ ‘రౌడీ అల్లుడు’. అందులో కామెడీ సీన్స్ చూస్తేనే రామ్ చరణ్ అన్నం తినేవాడని చెప్పారు.
చాలా మంది సినీ లవర్స్ కు ఇష్టమైన చిత్రం ‘రౌడీ అల్లుడు’ . కాగా, ఇందులో చిరంజీవి క్యారెక్టరైజేషన్స్ చాలా బాగుంటాయి. ఆటో జానీగా, కల్యాణ్ గా చిరు అభినయం జనాలకు బాగా నచ్చింది. చిరంజీవి ప్రస్తుతం తన సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.
త్వరలో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ పిక్చర్ లో చిరంజీవి వెరీ డిఫరెంట్ అవతార్ లో కనిపించనున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్, సునీల్, సల్మాన్ ఖాన్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా, మెహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.