Chocolate Day: ప్రేమగా నడిచే ప్రతి అడుగు తియ్యగా మారుస్తా..

-

ప్రతి వేడుకను తియ్యగా మారుస్తుంది చాక్లేట్.. అందుకే లవర్స్ కు చాకొలేట్ కు మంచి సంబంధం ఉంది. వాలంటైన్స్ డే వీక్ లో రోజ్ డే, ప్రపోజ్ డే లు అయిపోయాయి.. ఇప్పుడు చాక్లేట్ డే.. ప్రేమలో తీపి జ్ఞాపకాలను మరింత తియ్యగా చేసుకోవాలి.. రోజ్ ఇచ్చి మనసులోని భావాలను మాటల రూపంలో చెప్పిన తర్వాత.. నోరు తీపి చేసుకోవాలి కదా.. సో.. ప్రేమికలు ఒకరినొకరు చాక్లెట్స్ ఇచ్చిపుచ్చుకునే ట్రెండ్ స్టార్ట్ అయింది.

ఈ వాలెంటైన్స్ వీక్ లో చాక్లెట్ డే ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా.. ఏదైనా ప్రత్యేక సందర్భాన్ని స్మరించుకోవడానికి స్వీట్లు సరైన మార్గం. భారతీయ సంస్కృతిలో సంప్రదాయ మిఠాయిలకు అగ్రతాంబూలం వేస్తుంటారు.. ఇక లవర్స్ ఎక్కువగా చాక్లేట్ లను ఇస్తుంటారు..ఫిబ్రవరి 9 న చాక్లెట్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు. వాలెంటైన్ వీక్ లోని మూడో రోజు ప్రేమ, మాధుర్యాన్ని పంచుతుంది. విక్టోరియన్ కాలం నుంచి చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకునే సంస్కృతి ఉంది. ప్రేమలో ఉన్న వ్యక్తులు ఒకరికొకరు ఇచ్చే బహుమతులలో చాక్లెట్లు ఫస్ట్ ప్లేసులో చాక్లేట్లు ఉన్నాయి..అందులో వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే డార్క్‌ చాక్లెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రుచితో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక గుణాలు కలిగి ఉంది. డార్క్‌ చాక్లెట్లు శరీరంలోని రక్త సరఫరాను మెరుగుపరస్తుంది. రక్తపోటు సమస్య నుంచి కాపాడుతుంది. మెదడు నుంచి గుండెకు రక్తాన్ని సాఫీగా సాగేలా చూస్తుంది. యాంటీ ఆక్సి డెంట్లు అధికం. డార్క్‌ చాక్లెట్లలో ముఖ్యంగా ఐరస్, మెగ్నీషియం, కాపర్‌ కలిగి ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.. ఇంతకన్నా వేరేది లేదు.. కదా..ప్రేమగా నడిచే ప్రతి అడుగు తియ్యగా మార్చుకోండి చాక్లేట్ తో.. హ్యాపీ చాక్లేట్ డే..

Read more RELATED
Recommended to you

Latest news