పొంగులేటితోనే విజయం..ఖమ్మంలో లక్ ఎవరికో?

-

Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా ఉన్నారు. ఆయన బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకు రావడం..సొంతంగా జిల్లాలో తన వర్గాన్ని పెంచుకునే దిశగా రాజకీయం చేస్తున్నారు. అలాగే తన వర్గం నేతలకు సీట్లు కూడా ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్ పార్టీని ఒక్క సీటు కూడా గెలవనివ్వకుండా చేయడమే తన లక్ష్యమని పొంగులేటి అంటున్నారు.

అయితే పొంగులేటి ఒంటరిగా ఆ పని చేయగలరా? అంటే చెప్పడం కష్టమే. పొంగులేటి వర్గం ఇండిపెండెంట్లుగా బరిలో దిగితే..గెలిచే అవకాశాలు లేవు..కానీ ఓట్లు చీల్చే ఛాన్స్ ఉంది..దాని వల్ల బి‌ఆర్‌ఎస్ పార్టీకే నష్టం జరగవచ్చు. అలా అని కాంగ్రెస్ పార్టీకి సైతం కొన్ని స్థానాల్లో దెబ్బ తప్పదు. అంటే ఖమ్మం జిల్లా రాజకీయాలని పొంగులేటి బాగా ప్రభావితం చేస్తున్నారనే చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్తారో..ఆ పార్టీకి ఖమ్మంలో సత్తా చాటే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Khammam
Khammam

పొంగులేటి కూడా అదే విషయం చెబుతున్నారు..తాను ఏ పార్టీలోకి వెళితే..ఆ పార్టీ ఖమ్మంలో గెలుస్తుందని అంటున్నారు. అయితే ఇందులో కాస్త వాస్తవం ఉంది. కాకపోతే ఏ పార్టీలోకి వెళ్తారో మాత్రం పొంగులేటి చెప్పడం లేదు. అటు బి‌జే‌పి, ఇటు కాంగ్రెస్ పార్టీలు పొంగులేటిని లాగడానికి చూస్తున్నాయి. కానీ పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్తారో చెప్పడం లేదు.

అయితే పొంగులేటి ఎన్నికల ముందే ఏదైనా పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అప్పటివరకు తన బలాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఖమ్మంలో ఉన్న పరిస్తితులని చూస్తే..జిల్లాలో కాంగ్రెస్ పార్టీకే పట్టు ఉంది. ఒకవేళ పొంగులేటి కాంగ్రెస్ లోకి వెళితే..జిల్లాలో ఆధిక్యం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news