ప్రస్తుతం ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం జగన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న కోనసీమ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. తన వద్దకు ఓ వినతి పత్రం చేతబట్టుకొని ఎనిమిది నెలల బాలుడితో వచ్చిన ఓ మహిళ నుంచి వినతి పత్రాన్ని స్వీకరించిన జగన్ ఆమె చేతిలోని బాలుడుని జగన్ తన చేతిలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ బుడ్డోడు సీఎం జగన్ జేబులోని పెన్ను లాగాడు.
అది కాస్త కింద పడింది దీంతో ఓ చిరునవ్వు నవ్వుతూ ఆ బుడ్డోడికి సీఎం జగన్ పెను గిఫ్ట్ గా ఇచ్చేశాడు. ఆ పెన్ను ఖరీదు అక్షరాల 40000 రూపాయలు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఇవాళ సీఎం వైయస్ జగన్ అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.
రెండో రోజు కూడా గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడనున్న సీఎం వైఎస్ జగన్…ఉదయం 8.30 గంటలకు రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరనున్నారు. ఏఎస్‌ఆర్ జిల్లా చింతూరు చేరుకోనున్న సీఎం….ఉదయం 9.30 గంటలకు చింతూరు మండలం కుయుగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో సమావేశం కానున్నారు.
ఆసక్తికర సన్నివేశం.. చంటిబిడ్డకు పెన్ను గిఫ్ట్‌గా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. pic.twitter.com/zIK0ecl6rl
— Sakshi TV (@SakshiHDTV) July 26, 2022