గ్రామ పంచాయతీలకు జగన్‌ శుభవార్త.. పెండింగ్‌ బిల్లులు చెల్లింపులు

-

గ్రామ పంచాయతీలకు సీఎం జగన్‌ శుభవార్త చెప్పారు. ఏప్రిల్‌ 10 కల్లా గ్రామ స్థాయిలో ఉపాధి హామీ సహా అన్ని బిల్లులనూ చెల్లిస్తామని.. మీరు గ్రామాలకు వెళ్లేసరికి బిల్లులు పెండింగులో ఉన్నాయనే ప్రశ్నరాదని పేర్కొన్నారు. నగరాలు, పట్టణాల్లో కూడా బిల్లులు చెల్లిస్తామని… ప్రతి ఎమ్మెల్యేకూ రూ.2 కోట్ల ప్రత్యేక నిధి ఉంటుందని చెప్పారు. ఏప్రిల్‌ 1 నుంచి యాక్టివేట్‌ అవుతుందని.. ప్రతి గ్రామంలో మన ప్రతినిధులు ఉన్నారని వైసీపీ ప్రజా ప్రతినిధులకు చెప్పారు.

సర్పంచులు, వార్డు మెంబర్లు, బూత్‌కమిటీలు.., ఎంపీటీసీలు… వీరంతా ఉన్నారని.. వీరందరికీ మంచి శిక్షణ అవసరమని వెల్లడించారు. తెలుగుదేశం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని.. వారికి డైనమిక్‌గా ట్రైనింగ్‌ ఇవ్వాలన్నారు. టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు వెంటనే కౌంటర్‌ ఇస్తారని.. అది నేరుగా వారికి చేరుతుందని పేర్కొన్నారు.

మనం చేస్తున్న యుద్ధం కేవలం చంద్రబాబుతో కాదు, మనం యుద్ధం చేస్తున్నది ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి ఉన్మాదులతో యుద్దం చేస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు నానా ప్రయత్నాలు చేస్తారని.. గోబెల్స్‌ ప్రచారంతో బుల్డోజ్‌ చేస్తారని ఎమ్మెల్యేలకు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news