చైనాలో కరోనా కల్లోలం… 13 నగరాల్లో లాక్ డౌన్

-

చైనాను కరోనా కేసులు కలవరం పెడుతున్నాయి. రికార్డ్ స్థాయిలో కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. చైనాలో కరోనా ప్రారంభం అయిన తర్వాత ఈ సారే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. చైనా మంగళవారం 5,280 కొత్త కోవిడ్ -19 కేసులను నివేదించింది, ఇది అంతకుముందు రోజు కంటే రెట్టింపు కంటే ఎక్కువ. మార్చి నెలలో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 15,000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. జీరో కోవిడ్ స్ట్రాటజీని అవలంభించే చైనా.. కఠిన నియమాలను పెడుతోంది. టెస్టుల సంఖ్యను  పెంచుతోంది.

కోవిడ్ కేసుల వల్ల దేశంలో 13 నగరాల్లో లాక్ డౌన్ లు, పాక్షిక ఆంక్షలు విధించారు. దాదాపు 30 మిలియన్ల జనాభా కఠిన ఆంక్షల్లో ఉన్నారు. చైనాలోని ప్రధాన నగరాలు బీజింగ్, షాంఘై నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే విమానాలలో చాలా వరకు రద్దు చేశారు. ఇప్పటికే టెక్ సిటీ షెన్జెన్ లో లాక్ డౌన్ విధించారు. అక్కడ 17.5 మిలియన్ల జనాభా ఆంక్షలు మధ్య ఉన్నారు. జిలిన్, షాంఘై, లాంగ్ ఫాంగ్, చాంగ్ చున్ నగరాల్లో ఆంక్షలు విధించారు.

Read more RELATED
Recommended to you

Latest news