ఏపీలోని రైతులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా పెద్ద మొత్తంలో ఉపాధి లభించనుందని సీఎం జగన్ తెలిపారు. వీటిపై ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయని, దాదాపు 66వేల ఎకరాలకుపైగా భూమిని ఈ ప్రాజెక్టులకు వినియోగించాల్సి ఉంటుందన్నారు సీఎం జగన్. అర హెక్టార్ కన్నా తక్కువ భూమి ఉన్న జనాభా రాష్ట్రంలో 50 శాతం ఉండగా… ఒక హెక్టర్ కంటే తక్కువ భూమి ఉన్నవారు 70 శాతం ఉన్నారని వివరించారు సీఎం జగన్.
ఈ ప్రాజెక్టుల ద్వారా బీడు భూములున్న వారికి మంచి ఆదాయం రానుందన్న సీఎం జగన్.. బీడు భూములను లీజు విధానంలో తీసుకుని, ఏటా ఎకరాకు దాదాపు 30 వేలు చెల్లించేలా నూతన విధానం తీసుకువస్తున్నామన్నారు. అంతేకాక రైతుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు కల్పించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు సీఎం జగన్. గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టుల కారణంగా సుమారు 30 వేలమందికిపైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు సీఎం జగన్.