ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా గత రెండేళ్ల నుంచి జరిగిన పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం విషయంలో రోడ్ల విస్తరణ విషయంలో ప్రజల్లో అసహనం అనేది ఎక్కువగా ఉంది. రోడ్ల విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి జగన్ సీరియస్గా దృష్టి పెట్టిన సరే ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లడం లేదు. ఇక పెట్రోల్ ధర విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా పెంచడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్ల నిర్మాణం సరిగా లేక మరో పక్కన ఇంధన ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో దృష్టి పెట్టే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి త్వరలోనే జగన్ ఒక ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లవచ్చు అని తెలుస్తుంది.
దీనికి సంబంధించి సీనియర్ అధికారులతో ఒక కమిటీని కూడా జగన్ వేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తే ప్రజల్లో సానుకూలత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను అంచనా వేయడమే కాకుండా మండలాల వారీగా నిధులు అంచనాను తనకు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ కోరుతున్నారు.