ఆప్కాస్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌..!

-

ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ గుడ్‌ న్యూస్ అందించారు. ‘ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌ డ్‌ సర్వీసెస్‌” ని తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ ప్రారంభించారు. స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌, అన్‌ స్కిల్డ్‌ మ్యాన్‌పవర్‌ను గుర్తించి వివిధ శాఖలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆప్కాస్‌ లో నియమించబడ్డ వారికి ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ లాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..

ys jagan mohan reddy new plan to develop his party in every constituency

ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత ఉంటుందన్నారు. ప్రతి నెలా 1వ తేదీనే జీతం చెల్లిస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులకు పూర్తి భద్రతను కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీని ద్వారా రాష్ట్రంలో 47 వేల మందికి పైగా  ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు లబ్ధి జరుగనుందని తెలిపారు. అలాగే ఇప్పటికే ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా  పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించబోమని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల ప్రకారం నియమకాలు ఉంటాయని, మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ వర్తిస్తుందని సీఎం స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news