దేశంలో వాతావరణ మార్పుల వలన, మనుషుల విధానాల వలన పచ్చదనం అనేది కరిగిపోతుంది. దీనితో వాతావరణంలో సమూల మార్పులు వస్తున్నాయి. ప్రజల వ్యాపారాల కోసం పచ్చదనం అనేది లేకుండా చేస్తున్నారు. దీనితో భూమి మీద పచ్చదనం అనేది తగ్గిపోతు వస్తుంది. ఈ నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు మారాలని కోరుతున్నారు.
ఎన్నో అవగాహానా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అయినా సరే ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఈ తరుణంలో తమిళనాడుకి చెందిన అంబుసారి అనే వ్యక్తి 60 ఏళ్ళ వయసులో ప్రకృతి కోసం నడుం బిగించాడు. 11ఏళ్లుగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ 45,610 కిలోమీటర్లు పూర్తి చేసుకుని మంగళవారం తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు అగ్నిమాపక కేంద్రానికి చేరుకున్నాడు.
ఈ సందర్భంగా అగ్నిమాపక దళాధికారి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది అంబుసారికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబుసారి మాట్లాడారు. అనేక రాష్ట్రాల్లో పచ్చదనం ఆవశ్యకతను ప్రజలకు వివరించానన్నారు. ప్రాణ వాయువును అందించే నత్తల పెంపకం ప్రతీ ఒక్కరు చేపట్టాలనే లక్ష్యంతో ఈ యాత్ర చేస్తున్నా అని, గ్రీన్ ఇండియాగా దేశం మారడమే తన ఉద్దేశమని, పచ్చదనం కరువైతే ప్రజల ప్రాణాలకే ముప్పని స్పష్టం చేసారు.