ఏపీ నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. బోధన సిబ్బంది భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. టీచింగ్ ఫ్యాకల్టీలో ఎక్కడ ఖాళీలు ఉన్నా వెంటనే భర్తీచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టీచింగ్ స్టాఫ్ నియామకంలో ఎక్కడా సిఫార్సులకు తావు ఉండకూడదని.. వారికీ పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయాలని పేర్కొన్నారు.
టీచింగ్ స్టాఫ్ కమ్యూనికేషన్ల నైపుణ్యాన్నికూడా పరిశీలించాలని.. యూనివర్శిటీల్లో క్రమశిక్షణ, పారదర్శకత అత్యంత ముఖ్యమైనవన్నారు సీఎం జగన్. ఉన్నత విద్యపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ… గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (జీఈఆర్) గణనీయంగా పెరగాలని.. అందుకే విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో కన్నా జీఈఆర్ పెరిగిన మాట వాస్తవమేనని.. జీఈఆర్ 80శాతానికి పైగా ఉండాలన్నారు. వీటిపై అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని.. జీఆర్‌ఈ, జీ మ్యాట్ పరీక్షలపైన కూడా విద్యార్థులకు మంచి శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు సీఎం జగన్.