ప్రతీ ఏటా 8వ తరగతిలోకి వచ్చేవారికి ట్యాబ్ లు ఇస్తామని కీలక ప్రకటన చేశారు ఏపీ సీఎం జగన్. ప్రతి ప్రభుత్వ స్కూళ్లు, ఎయిడెడ్ స్కూళ్ళల్లోని 8వ తరగతి విద్యార్థుల చేతుల్లో డిజిటల్ ట్యాబ్‌లు పెట్టగలిగామని వివరించారు సీఎం జగన్. యడ్లపల్లి హైస్కూల్‌లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు సీఎం జగన్.

4.59 లక్షల మంది విద్యార్థులు, 59,176 ఉపాధ్యాయులకు రూ.686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేశారు సీఎం జగన్. అనంతరం మాట్లాడుతూ, తరాలు మారుతున్న కొన్నివర్గాల తలరాతలు మారకూడదన్నది పెత్తందారీ స్వభావం.. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం విద్య అందకూడదని పెత్తందారీ భావాలు ఆరాటపడటం చూసి బాధ వేసింది, అందుకే ఆ భావాలను బద్దలు కొడుతూ నిర్ణయాలు తీసుకున్నానని చెప్పారు సీఎం జగన్. నా పుట్టినరోజున నాకు ఎంతో ఇష్టమైన చిన్నారుల భవిష్యత్తు కోసం ఇంత అద్భుతమైన చేయగలుగుతున్నానని పేర్కొన్నారు.