కులం, మతం, పార్టీ తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రకటించారు సీఎం జగన్. మన ప్రభుత్వంలో కులం చూడ్డంలేదు, వర్గం చూడ్డంలేదు, పార్టీలు చూడ్డంలేదు, అవినీతికి తావులేకుండా, వివక్షకు అవకాశం లేకుండా, పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, వైయస్సార్ మత్స్యకార భరోసా, రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీ, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన, వైయస్సార్ సున్నావడ్డీ, వైయస్సార్ సున్నావడ్డీ పంటరుణాలు, వైయస్సార్ కాపునేస్తం, వైయస్సార్ వాహనమిత్ర, వైయస్సార్ నేతన్న నేస్తం పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేశారు సీఎం జగన్.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. అర్హత ఉండి కూడా ఏ ఒక్కరుకూడా మిస్‌కాకూడదని.. దీనికోసమే తపన, తాపత్రయం పడుతున్నాం. దీనికి ఇవాళ్టిరోజే నిదర్శనమని పేర్కొన్నారు. అధికారం అంటే ప్రజలమీద మమకారం, అధికారం అంటే అజమాయిషీ కాదని.. గతంలో వివిధ కారణాల వల్ల అందుకోలేకపోయిన అర్హులందరికీ కూడా ఇవాళ వారి ఖాతాల్లో జమచేస్తున్నామని ప్రకటించారు. అంతేకాదు కొత్తగా పెన్షన్‌కార్డులు, బియ్యంకార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నామని.. మరో 3.10లక్షల కుటుంబాలకు ఈ కార్డులు ఇస్తున్నామని వెల్లడించారు.