కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ అరవింద్ పై కేసు నమోదు

-

ఈనెల 14వ తేదీన ఎం కేసీఆర్ పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్.. బేవకూఫ్.. నీకు దమ్ముంటే 2014-2018 మేనిఫెస్టోపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. జోగులాంబ అమ్మవారిపై మాట్లాడుతావా.. ముస్లింలపై మాట్లాడి చూడు.. దమ్ముంటే అని సవాల్ విసిరారు.మసీదు లపై మాట్లాడి చూడు కోడి మెడ కోసినట్లు కోసి పడేస్తారు…కల్చర్ లెస్ ఫెలో అని కేసీఆర్ పై మండిపడ్డారు.

లయ్యర్, థర్డ్ గ్రేడ్ ఫెలో.., యూస్ లెస్ ఫెలో..మేము కేసీఆర్ లెక్క సంస్కార హీనులం కాదు..కేసీఆర్ ఎంత చిల్లర గాడో.. అందరికీ అర్థమైందన్నారు. చెంప దెబ్బకు.. దవడ పళ్ళు రాలగొడతామని హెచ్చరించారు.రెండు, రెండు గంటలు మీడియా సమావేశాలు మానేసి, భారీ వర్షాలపై రోజుకి ఒక రెండు గంటలు అయినా సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కి సూచించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.అయితే ఈ వ్యాఖ్యలపై నిజామాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అడ్వకేట్ జాక్ నాయకులు. ఎంపీ అరవింద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news