ఢిల్లీ వెళ్లి వచ్చిన అందరిని గుర్తిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్ట౦ చేసారు. అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. కరోనా అంటే జ్వరం లాంటిదే అన్నారు జగన్. ఏదో అయిపోతుంది అనే భయం అవసరం లేదని ఆయన సూచించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు అందరూ కూడా బయటకు రావాలని జగన్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. ఎవరికి బాగా లేకపోయినా సమాచారం ఇవ్వాలని కోరారు.
ఢిల్లీ వెళ్లి వచ్చిన వారికే కరోనా వైరస్ సోకిందని జగన్ అన్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు ఏపీ నుంచి 1085 మంది అని వారిలో 500 మందికి టెస్ట్ లు పూర్తి అయ్యాయని మరో 500 మందికి టెస్ట్ లు చేస్తున్నామని 21 మందిని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. జ్వరం వచ్చినట్టే కరోనా వస్తుందని జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతుందని అన్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు 104 కి ఫోన్ చెయ్యాలని సూచించారు.
ఎవరికి అయినా కరోనా వైరస్ వస్తే మానవత్వం చూపించాలని జగన్ కోరారు. దేశ అధ్యక్షులకు కూడా కరోనా వైరస్ సోకిందని న్నారు. కరోనా వైరస్ చాలా చిన్న విషయమని అన్నారు. జ్వరం వస్తే తగ్గినట్టే తగ్గుతుంది అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఆదాయం తగ్గింది, ఖర్చులు మాత్రం పెరిగాయని అన్నారు. జీతాలు వదులుకున్న ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ ఉద్యోగులకు ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు చెప్పారు.
81 శాతం మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారె ఉన్నారని ఆయన అన్నారు. వ్యవసాయ పనులు రైతులు చేసుకోవచ్చు అని వారు సామాజిక దూరం పాటిస్తే చాలని అన్నారు. వారిని ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు పెట్టే అవకాశం లేదని స్పష్టం చేసారు. మధ్యాహ్నం 1 గంట వరకు వ్యవసాయ పనులు చేసుకోవచ్చు అని జగన్ పేర్కొన్నారు.