ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో పెను మార్పులు తీసుకువచ్చారు. స్కూల్ పరిశుభ్రత దగ్గర నుండి వారు ఎందుకు స్కూల్ కి రావడం లేదన్న వరకు ప్రతి ఒక్క విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటూ వచినందువలనే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా అన్ని ఏర్పాట్లు ఉండడంతోనే ఇది సాధ్యమైందని పిల్లల తల్లితండ్రులు గర్వంగా చెప్పుకుంటున్నారు. కాగా సీఎం జగన్ మరొక కొత్త విధానాన్ని తీసుకువచ్చి టీచర్ లకు చెప్పారు.
పిల్లలు ఎవరైనా స్కూల్ కు ఆబ్సెంట్ అయితే వెంటనే ఆ పేరెంట్ కు ఫోన్ వెళ్లాలని సూచించారు. ఫోన్ చేసి ఎందుకు రాలేదు అని కనుక్కుని సరై కారణాన్ని రిపోర్ట్ చేయాలని సీఎం చెప్పారు. ఇలా చేయడం వలన పిల్లల కుటుంబాల గురించి కూడా మనకు అవగాహన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సీఎం జగన్.