ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. గర్భిణీలు, బాలింతల కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ప్లస్ పథకాలను అందుబాటులోకి తీసుకురనున్నారు. ఇవాళ ఉదయం 11:00 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా గర్భిణీలు, బాలింతలు, 36 నెలల లోపు పిల్లలు, 36 నుంచి 72 నెలల లోపు పిల్లలకు పోషకాహారం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నెలకు ఒక్కొక్కరిపై రూ.412 చొప్పున ఖర్చు చేయనున్నారు. అలాగే కృష్ణా జిల్లాలో సోమవారం నుండి ప్రారంభం కానున్న పోషణ పథకం క్రింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సైతం అమలు చేయడం జరుగుతుంది. కాగా, విజయవాడ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి సోమవారం ఉదయం 11.00లకు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.