రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ‘మేము రూ.లక్ష వరకు చేస్తామన్నాం. ఓట్లు గుద్దితే మాకు 88 సీట్లు, వాళ్లకు 19 సీట్లు వచ్చాయి. ఎలా పడితే అలా మాట్లాడితే ప్రజలు నమ్మరు. పింఛన్లు కూడా పెంచుతాం. కానీ ఒకేసారి పెంచం. తప్పుడు హామీతో గెలుద్దామని కాంగ్రెస్ చూస్తోంది. మా అమ్ముల పొదిలో చాలా అస్త్రాలున్నాయి. ఒక్కొక్కటిగా ప్రయోగిస్తాం’ అని తెలిపారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. మేం కాంగ్రెస్ అంత గొప్పోళ్లం కాదు. మేము మాత్రం రూ.లక్ష వరకు చేస్తామని చెప్పారు. గుద్దుడు గుద్దితే మేం 80 సీట్లు గెలిచాం.. వాళ్లు 19 సీట్లు గెలిచారు. అలవికానివి చెబితే ఎవరూ నమ్మరు.
ఏ విధంగా పెన్షన్ ఎలా పెంచాలో పెంచుతాం. ఒకటేసారి పెంచలేం. క్రమానుగతంగా తీసుకెళ్తాం. మా దగ్గర ఇంకా గంపెడున్నయ్. మా దగ్గర చాలా అస్త్రాలున్నాయ్. మా అమ్ములపొదిలో చాలా అస్త్రాలు ఉన్నయ్. రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది మేం. సంక్షేమాన్ని అమలు చేస్తున్నది మేము. రెండేళ్ల నుంచి రూ.2వేలు ఇస్తున్నాం. మొదట వెయ్యి ఆ తర్వాత రూ.2వేలు ఇచ్చాం. కల్యాణలక్ష్మిలో మొదట రూ.50వేలు.. ఆ తర్వాత రూ.లక్ష ఇచ్చాం. గొర్ల యూనిట్లకు సైతం రూ.1.75లక్షలకు పెంచాం. రైతుబంధు రూ.4వేలతో మొదలు పెట్టి.. రూ.5వేలకు పెంచాం. రాబోయే రోజుల్లో ఎంత దూరం పెంచగలుగుతమో అంత వరకు పెంచుతాం’ అని తెలిపారు.