ఏపీనే అంధకారంలో పోయింది : కరెంట్ కోతలపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన అనంతరం సీఎం కేసీఆర్‌.. ఆంధ్ర ప్రదేశ్‌ కరెంట్‌ కోతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే… తెలంగాణ అంధకారంలోకి వెళుతుందని కొందరు ఆంధ్ర ప్రదేశ్‌ నాయకులు అన్నారని గుర్తు చేశారు. అలాంటి ప్రస్తుతం ఏపీనే అంధకారంలోకి వెళ్లిందని ఎద్దేవా చేశారు సీఎం కేసీఆర్‌.

కరెంట్‌ ఉత్పత్తి లో తెలంగాణ రాష్ట్ర దూసుకు పోతుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌. కానీ ఏపీ లో ఇప్పుడు కరెంట్‌ కోతలు, అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఏ ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి విడిపోయామో ఆ రాష్ట్రానికి ఇప్పుడు కరెంట్‌ లేదని చురకలు అంటించారు సీఎం కేసీఆర్‌.

ఏ ఒక్క వ్యక్తి వల్లో ఇంతటి అభివృద్ధి సాధ్యం కాదని… ఇది సమిష్ట కృషి అన్నారు. తెలంగాణ ప్రజల ముఖాల్లో చిరునవ్వును చూడగలుగుతున్నామని పేర్కొన్నారు. అన్ని ఆటంకాలను.. కేసులను తట్టుకుని ముందుకు సాగుతున్నామన్నారు. భారత దేశాన్ని తట్టి లేపిన… పథకం దళిత బంధు పథకమని కొనియాడారు సీఎం కేసీఆర్‌.