ఏపీ వాళ్లు కూడా దళిత బంధు కావాలంటున్నారు : సీఎం కేసీఆర్

టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం లో అధికారికంగా సీనియర్‌ నాయకులు కేకే ప్రకటించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ…. తనను అధ్యక్షుడిగా ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నందుకు ధ‌న్యవాదాలు చెప్పారు. ర‌క‌ర‌కాల అప‌ నమ్మకాల మ‌ధ్య గులాబీ జెండా ఎగిరిందని పేర్కొన్నారు.

KCR-TRS
KCR-TRS

తొలి సారి 2001లో జ‌ల‌దృశ్యంలో పార్టీ జెండా ఆవిష్కరించామని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర పోరాటం త‌ర‌హాలోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభ‌మైందని… అహింసా మార్గంలోనే తెలంగాణను సాధించుకున్నామని కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లోని సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని.. దళిత బంధు పథకం పై ఏపీ నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. ఏడేళ్ల కింద తెలంగాణ ఎలా ఉండే… ఇప్పుడేలా ఉందని కేసీఆర్‌ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో వచ్చిన ఈ ఏడేళ్ల లో… తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు.