బండి సంజయ్ కి హిందీ కూడా రాదు..అన్ని చిల్లర మాటలే : సిఎం కెసిఆర్

తెలంగాణ బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ పై ఓ రేంజ్ లో రెచ్చి పోయారు తెలంగాణ సిఎం కెసిఆర్. కేసీఆర్ ను టచ్ చేసి చూడు అంటూ బండి సంజయ్ కి సవాల్ విసిరారు. నన్ను జైలుకు పంపించి తెలంగాణలో తిరగగులుగుతావా..? అంటూ బండి సంజయ్ పై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు.  బండి సంజయ్.. ఎంపీ అయిఉండి..ఆయనకు  అసలు హిందీ కూడా రాదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సభ్యుడు అయి ఉండి.. జీవోలు కూడా అర్థం చేసుకోలేని…  పరిస్థితిలో బండి సంజయ్ ఉన్నారని కౌంటర్ ఇచ్చారు.   బండి సంజయ్ చిల్లర మాటలను సహించమనీ.. కేంద్రం వరిపంటను వద్దంటోందని మండిపడ్డారు.

చిల్లర రాజకీయాలను సహించబోమని.. రైతులు అల్లా టప్పా మాటాలు మాట్లోడ్డోద్దని సూచనలు చేశారు సిఎం కెసిఆర్. ఏనుగులు.. నడుస్తుంటే కుక్కలు ఎన్నో మొరుగుతయ్ అని పేర్కొన్నారు.. అధికారులు చెప్పిన పంటలూ వేయండని రైతులకు సూచించారు. తప్పుడు మాటలు మార్చేస్తే నాలుక చీలుస్తామనీ వార్నింగ్ ఇచ్చారు. తన మెడలు వంచడం కాదు.. నీ మెడలు వంచుతామనీ హెచ్చరించారు సిఎం కెసిఆర్.