మోత్కుపల్లి నాకు అత్యంత సన్నిహితుడు : సీఎం కేసీఆర్

-

మోత్కుపల్లి నర్సింహులు నాకు అత్యంత సన్నిహితుడు అని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అన్నారు. కాసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి.. పార్టీలోకి మోత్కుపల్లి నర్సింహులును ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. మోత్కుపల్లి నర్సింహులు కు పదవులు కొత్త కాదని.. ఆయన గొప్ప నాయకూడన్నారు.

mothkupally narsimhulu cm kcr

ఆయనకు కరోనా వస్తే.. ఫోన్ చేసి పరామర్శించానని పేర్కొన్నారు సిఎం కెసిఆర్. తెలంగాణ ఉద్యమ సమయంలో నన్ను తిట్టినన్ని తిట్లు ఈ దేశంలో ఎవరని తిట్టలేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఒక మాయావతి ఇంటికి 19 సార్లు పోయానని.. తెలంగాణ గురించి మాయావతికి చెప్పానని పేర్కొన్నారు. 32 పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ సాధించామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పడు అనేక సమస్యలు ఉన్నాయని.. కింద మీద పడి ఒక రాస్తా ఎసుకుని బయలుదేరానని చెప్పారు. తెలంగాణ గ్రామాలు ఇప్పుడు మంచిగా తయారు అయ్యాయని.. గ్రామాలకు పోతే ఇప్పడు ఉండాలని అనిపిస్తుందన్నారు. హైదరాబాద్ నుంచి వేల సంఖ్యలో పండుగకు ఊర్లకు పోయి మళ్ళీ వస్తుంటే జామ్ అయితుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news