తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో గంగుల కమలాకర్ తండ్రి మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే, గంగుల కమలాకర్ కు సీఎం కేసీఆర్ తో సహా అన్ని పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
ఇక తాజాగా సీఎం కేసీఆర్ స్వయంగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లి, ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు సీఎం కేసీఆర్.