మన ఉద్యోగులకు కడుపునిండా జీతం ఇస్తున్నామని.. కింది స్థాయి ఉద్యోగులకు కూడా 30 శాతం జీతాలు పెంచామని కేసీఆర్ అన్నారు. సెర్ఫ్ లో పని చేస్తున్న 4 వేల కన్న పైచిలుకు మందికి ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు ఇస్తామని ఆయన అన్నారు. మహిళా సంఘాల్లో అవేర్నెస్ పెంచుతున్నారని.. మంచి ఫలితాలు సాధిస్తున్నారని కితాబు ఇచ్చారు. ఉపాధి హామీలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగస్తులు కారని.. గతంలో సమ్మెకు వెళ్లారని.. వాళ్ల మీద మాకు కోపం లేదని.. కానీ మళ్లీ నేను హెచ్చరిక పూర్వకంగా చెబుతున్నానని.. ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీలో కేసీఆర్ తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకున్నందుకు ప్రతిపక్ష నేత బట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. ఐకేపీ, మెప్మా వాళ్లకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనం ఇస్తామని ప్రకటించారు. తెలంగాణలో శాంతి భద్రలు మంచిగా పరిరక్షిస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రగతికి పోలీసులు కూడా కారణం అయ్యారని కేసీఆర్ అన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్లకు కేసీఆర్ గుడ్ న్యూస్… మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీలో ప్రకటన
By Advik
-