ఎన్నికలు రాంగనే ఆగం కాకుండా ప్రజలు రౌతు ఏందో.. రత్నం ఏదో ఆలోచించాలి.. సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మీ అందరినీ ఒకేది ఒకటే. ఎలక్షన్లు రాంగనే ఎవరో వస్తరు.. ఏదో చెబుతరు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతరు. అలవిగాని సామెతలు చెబుతరు. ఆపదల మొక్కులు కూడా మొక్కుతరు.. తీర్థం పోదంపా తిమ్మక్క అంటే.. నువ్వు గుల్లె.. నేను సల్లే.. యాడికి తోలుకపోతరో తెల్వదు. ఇవాళ కొన్ని పార్టీలు మాట్లాడుతున్నయ్. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అంటున్నయ్. మీకు పది ఛాన్స్‌లు ఇచ్చారు కదా.. 60 ఏళ్లు రాజ్యం మీరే వెలుగబెట్టారు కదా? ఇక్కడి నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా. దళిత బిడ్డలు ఆలోచన చేయాలి. మనందరికీ సిగ్గుచేటు’ అన్నారు.
‘75 సంవత్సరాల తర్వాత కూడా మన దళితులు పేదరికంలో ఉన్నారంటూ దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాలి. 60-70కిందట దళితబంధులాంటి పథకం ప్రారంభించి ఉంటే ఇవాళ దళితుల్లో ఎందుకు పేదరికం ఉండుంటే ఆలోచన చేయాలి. ఈ విధాన లోపం ఎవరిదీ..? ఇవాళ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారో.. వారికి 10-12 ఛాన్సులు ఇచ్చారు. వాళ్లు ఏం చేయలేదు. పెన్షన్లు ఇచ్చారు.. ఎన్ని ఇచ్చారు ? మనం రూ.40, రూ.70, రూ.200 పెన్షన్లను చూశాం. నేను ముఖ్యమంత్రి అయ్యాక పెన్షన్లు ఎందుకు ఇవ్వాలని అడిగాను. దానికి ఏమైనా పర్పస్ ఉందా? పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి అని అడిగాను.
పెన్షన్‌ను రూ.400 చెద్దామని నిపుణులు చెప్పారు. పెన్షన్లు ఇచ్చేందుకు కారణం చేత ఇస్తామని అడిగాను. దురదృష్టవశాత్తు మానవ సమాజంలో కొందరు విధి వంచితులు ఉంటారు. మంచిగున్న మనిషి కూడా ప్రమాదంలో దివ్యాంగులు కావొచ్చు. కొందరు పుట్టకతోనే దివ్యాంగులు కావొచ్చు. కొందరు ఆలనా పాలనలేని స్త్రీలు, వృద్ధులుంటారని ఆలోచించించాం. ఆఫీసర్లు రూ.650 వరకు ఇవ్వాలని చెప్పినా వినకుండా రూ.1000 పెన్షన్ ఇచ్చాం. టర్మ్ తిరిగే సరికి రూ.2000వేలకు పెంచాం. మళ్లీ పెన్షన్‌ను రూ.5వేల పెంచబోతున్నట్లు ప్రకటించాం. ఓట్ల కోసం ఒకటే రోజులో ఇస్తామని చెప్పలేదు. గవర్నమెంట్ రాగానే పెన్షన్‌ను రూ.3వేలకు పెంచుతాం. రూ.500 పెంచుకుంటూ ఐదుసంవత్సరాలు పూర్తయ్యే సరికి రూ.5వేలకు పెంచుకుంటూ పోతాం’ అని తెలిపారు.